Feb 21, 2008

మీ కంప్యూటర్ లో exe ఫైల్స్ గురించి భయపడుతున్నారా?


కంప్యూటర్ లో ".exe" ఫైళ్ళు ఎన్ని ఎక్కువ రన్ అవుతుంటే, సిస్టమ్ అంత స్లో అవుతుంది. దీనికి కారణం ప్రతి exe ఫైలూ ప్రోససర్ యొక్క విలువైన శక్తిని ఎంతో కొంత వినిమయం చేస్తుంది కాబట్టి. exelib.com మీకు exe ఫైళ్ళ గురించి వివరాలను అందిస్తుంది. ఏ exe ఫైలు ఎందుకోసం? దాని వివరాలు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఆ ఫైలు ఎంత రిస్క్ తో్ కూడుకున్నది? వంటి అన్ని వివరాలను అందులో చూడచ్చు. మీ కంప్యూటర్ లోని టాస్క్ మేనేజర్ ని ఉపయోగించి, మీ సిస్టమ్ లో ఏఏ exe ఫైల్స్ ఉన్నాయి? అవి అవసరమైనవా కావా? అన్నది తెలుసుకుని, అనవసరమైన వాటిని తొలగించుకోవచ్చు. ఎందుకంటే ఎంత తక్కువ exe ఫైళ్ళో అంత ఎక్కువ కంప్యూటర్ స్పీడ్ మరి.

No comments: